మహారాష్ట్రలోని భండారా-రామ్‌టెక్ జాతీయ రహదారిపై సటోనా గ్రామం వద్ద షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. ఎస్టీ బస్సు దిగి రోడ్డు దాటుతున్న 7వ తరగతి విద్యార్థినిని వేగంగా వచ్చిన స్కోర్పియో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బాలిక గాల్లోకి ఎగిరి రహదారిపై పడి తీవ్ర గాయాలపాలైంది. ఈ భయంకర దృశ్యాలన్నీ సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. స్థానికులు వెంటనే బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.