VIDEO: 112 మీటర్ల భారీ సిక్సర్ బాదిన శ్రేయస్!

న్యూజిలాండ్‌తో జరిగిన 5వ టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భారీ సిక్సర్ కొట్టారు. బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో అయ్యర్ భారీ సిక్సర్ బాదగా బంతి స్టేడియం బయటకు పోయింది. ఈ క్రమంలో బంతి 112 మీటర్ల దూరం దూసుకెళ్లినట్లు క్రీడావర్గాలు వెల్లడించాయి. ఈ భారీ షాట్‌తో స్టేడియంలోని అభిమానులు ఉత్సాహంతో ఊగిపోయారు. ఇటీవల ఫామ్ కోల్పోయి విమర్శలను ఎదుర్కొన్న శ్రేయస్, ఈ మ్యాచ్‌లో కీలకమైన హాఫ్ సెంచరీ సాధించి ఫామ్‌లోకి తిరిగి వచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕