VIDEO: లార్డ్స్ టెస్టులో డియోగో జోటాకు నివాళులర్పించిన సిరాజ్

లార్డ్స్ టెస్టులో బంతితో రాణించిన టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్.. ఇటీవలే కారు ప్రమాదంలో మరణించిన లివర్‌పూల్ ఫుట్‌బాల్ స్టార్ డియాగో జోటాకు నివాళులర్పించాడు. ఫామ్‌లో ఉన్న జేమీ స్మిత్‌ను అవుట్ చేసిన సిరాజ్.. చేతి వేళ్లతో 20 నెంబర్ చూపించి, ఆకాశం వైపు చూస్తూ నివాళులర్పించాడు. జోటా జెర్సీ నెంబర్ కూడా 20 కావడం గమనార్హం. ఈ మ్యాచులో 23.3 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ రెండు కీలకమైన వికెట్లు తీశాడు.

సంబంధిత పోస్ట్