రష్యాలో విపరీతమైన మంచు తుఫాను ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మాస్కో, వ్లాడివోస్టోక్ వంటి నగరాల్లో జనజీవనం స్తంభించింది. సెకనుకు 27 మీటర్ల వేగంతో వీస్తున్న మంచుగాలుల కారణంగా పలుచోట్ల విమాన ప్రయాణాలు ప్రభావితమయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు కార్లకు బదులుగా గుర్రాలపై తిరుగుతున్న దృశ్యాలు, డెలివరీ బాయ్స్ స్కీయింగ్ చేసుకుంటూ ఆర్డర్లు డెలివరీ చేస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.