రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక విద్యార్థి తన ఉపాధ్యాయుడిపైనే దాడికి దిగిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. శరణ్ నగర్ బనద్ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న టీచర్‌ను ఆ విద్యార్థి వెనుక నుండి వెంబడించి, ఒక్కసారిగా దాడి చేశాడు. విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపిస్తూ ఉపాధ్యాయుడిని దారుణంగా హింసించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.