బ్రెజిల్లో 16 మందిని చంపిన సీరియల్ కిల్లర్ జొర్లాన్ లోప్స్ డ సిల్వాను పోలీసులు అరెస్ట్ చేశారు. జొర్లాన్ శరీరాకృతి కారణంగా స్థానికులు అతడిని ‘మస్కిటో’(దోమ) అని పిలుస్తారు. పరైబా రాష్ట్రంలో ఉండే జొర్లాన్.. మారుమూల ప్రాంతాల్లో గత మూడు నెలల్లో 16 మందిని అత్యంత దారుణంగా హతమార్చాడు. హత్యల అనంతరం దట్టమైన అడవుల్లోకి వెళ్లి దాక్కునేవాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అమ్మాయిలా వేషం వేసుకొని తిరిగేవాడు. అనుమానం వచ్చి పోలీసులు నిఘా పెట్టడంతో ‘దోమ’దొరికాడు.