VIDEO: పశువుల దొంగతనం నెపంతో ముగ్గురిపై దాడి

మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో పశువుల దొంగతనానికి పాల్పడుతున్నారనే అనుమానంతో బోలెరో వాహనాన్ని అడ్డుకున్న ఒక గుంపు ముగ్గురిపై దారుణంగా దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బోర్‌ఖేడి పోలీసులు సమగ్ర విచారణ ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్