యూపీలోని చందౌలీ జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. సైకిల్‌పై వెళ్తున్న లక్కీ మౌర్య అనే బాలుడిని భారీ వేగంతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘోర ప్రమాదంతో ఆగ్రహించిన స్థానికులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, గ్రామస్తులకు నచ్చజెప్పి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు.