కొద్ది రోజులుగా పలు చోట్ల హిట్ అండ్ రన్ ఘటనలు జరుగుతున్నాయి. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఆటోరిక్షా రోడ్డుపై వేగంగా దూసుకొచ్చింది. రోడ్డు దాటుతున్న ఇద్దరిని ఆటో ఢీకొట్టింది. కొద్దిదూరం వారిని ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.