ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన కొడుకుని దారుణంగా హింసించి కొట్టింది. కుమారుడిపై కూర్చొని, పిడికిలితో కొట్టి, పళ్లతో కొరికి, పిల్లాడి తలను నేలకు కొట్టి, దారుణంగా హింసించింది. కొట్టవద్దు అని ఎంత ప్రాధేయపడినా వదల్లేదు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. ఈ హింసాత్మక ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.