రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా నుంచి మరో సాంగ్ ప్రోమో విడుదలైంది. 'వాక వాక’ అంటూ సాగే పాట ప్రోమోను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ నెల 22న పూర్తి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన 'నానా హైరానా' పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.