VIDEO: భర్తను చంపి బాత్‌రూమ్‌లో పాతిపెట్టిన భార్య

యూపీలోని ఆగ్రాలో దారుణ ఘటన వెలుగుచూసింది. రూబీ అనే మహిళ తన భర్త సురేంద్ర శర్మను దారుణంగా హత్య చేసి, శవాన్ని ఇంట్లోని బాత్‌రూమ్‌లోనే పాతిపెట్టింది. ఏమీ తెలియనట్టు పోలీసులకు భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. దాదాపు 45 రోజుల పాటు పోలీసులను తప్పుదోవ పట్టించినా, చివరకు విచారణలో నిజం బయటపడింది. పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి, బాత్‌రూమ్ నేలను తవ్వి శవాన్ని వెలికితీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్