VIDEO: భర్తను కృష్ణానదిలోకి తోసేసిన భార్య.. కాపాడిన స్థానికులు

కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో శనివారం కృష్ణానది మధ్యలో ఓ యువకుడు చిక్కుకున్నాడు. రెండు గంటల పాటు కష్టపడి స్థానికులు తాళ్ల సాయంతో అతడిని రక్షించారు. వంతెన అంచున నిలబడి ఉన్న తనను సెల్ఫీ తీసే నెపంతో భార్య నదిలోకి తోసిందని అతడు తెలిపాడు. అయితే తన భర్త కాలు జారి పడిపోయాడని యువతి చెప్పింది. ఆ జంట ఇటీవల వివాహం చేసుకున్నారని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్