తమిళనాడులోని మధురైలో అక్టోబర్ 20 న షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడ కొంతమంది చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. బైకుపై వచ్చిన నిందితులు ఓ మహిళ మెడలో నుంచి చైన్ లాగడానికి ప్రయత్నించారు. గొలుసు లాగే క్రమంలో మహిళ కిందపడిపోయింది. అనంతరం ఆమెను రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. దీంతో గొలుసు తెగి రెండు ముక్కలైంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.