AP: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో రాజకీయాలు వేడెక్కాయి. కూటమి సర్కార్ అండతో టీడీపీ రేషన్ డీలర్స్ రెచ్చిపోయారు. అప్పే చెర్ల గ్రామానికి చెందిన వైయస్ఆర్ సీపీ నేతలు భాస్కర్ రెడ్డి, అతని తమ్ముడిపై వేట కొడవలితో టీడీపీ రేషన్ స్టోర్ డీలర్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం వారిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.