హర్యానాలోని ఫతేపూర్ బిల్లోచ్ గ్రామంలో వేధింపులను ఎదిరించిన ఒక యువకుడిపై దుండగులు అమానుషంగా దాడి చేశారు. నిందితులు తన సోదరిని వేధిస్తుండటాన్ని గమనించిన అన్న, వారిని గట్టిగా నిలదీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆకతాయిలు గుంపుగా వచ్చి ఆ యువకుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. పట్టపగలే అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.