రైలుపై రెండు బోగీల మధ్య కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణాలోని మంచిర్యాల పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గోరఖ్ ప్పూర్ ఎక్స్ ప్రెస్ రైలుపై వెళ్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు గుర్తించి కిందికి దించారు. విచారణలో అతడు పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.