VIDEO: రూ.4,711 డీజిల్ కొట్టించుకుని పరారైన యువకులు

బెంగళూరులోని ఉడుపిలోని ఇండియన్ ఆయిల్ బంక్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తెల్లటి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్లో వచ్చిన ముగ్గురు యువకులు రూ.4,711 విలువైన డీజిల్ పోయించుకుని డబ్బులు ఇవ్వకుండా పరారయ్యారు. తులు భాషలో మాట్లాడుతూ, తాము కుమటాకు చెందినవారమని నమ్మించిన వీరు, బంక్ వద్ద బీర్ సీసాలను వదిలి వెళ్లారు. సీసీటీవీలో నంబర్ ప్లేట్ పడకుండా జాగ్రత్తపడిన వీరిపై షిర్వా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్