ఆసుపత్రిలోని చిన్నారులతో మాట్లాడిన విజయ్ దేవరకొండ, హరీష్ రావు

TG: సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్‌ను ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఎటువంటి ఖర్చు లేకుండా, పూర్తిగా ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీలు, అధునాతన చికిత్సలు అందిస్తున్న ఈ ఆసుపత్రి సేవలను వారు ప్రశంసించారు. ఆపదలో ఉన్న పసిహృదయాలకు ఈ కేంద్రం నిజంగానే 'సంజీవని'లా మారిందని వారు కొనియాడారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని చిన్నారులతో విజయ్ దేవరకొండ, హరీష్ రావు మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్