నటుడు విజయ్ దేవరకొండ తన సొంతూరు తుమ్మన్‌పేటలో రష్మికతో వివాహం అనంతరం విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లను ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం అచ్చంపేట డివిజన్ పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేశారు. తాజాగా ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేసింది.