'కింగ్డమ్‌'పై రష్మిక పోస్టు.. రిప్లై ఇచ్చిన విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన 'కింగ్డమ్‌' మూవీ గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'విజయ్‌.. నీకు, నిన్ను అభిమానించే వారికి ఈ విజయం ఎంత కీలకమైందో నాకు తెలుసు. మనం హిట్‌ కొట్టినాం' అంటూ ఈ చిత్ర విజయంపై రష్మిక తాజాగా పోస్టు పెట్టారు. కాగా, రష్మిక ట్వీట్‌పై విజయ్‌ దేవరకొండ స్పందించారు. ‘మనం హిట్‌కొట్టాం’ అని పేర్కొన్న ఆయన దానికి హార్ట్‌ ఎమోజీ జోడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్