విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన 'కింగ్‌డమ్' మూవీ ప్రీమియర్లు అమెరికాలో రన్ అవుతున్నాయి. ఈ యాక్షన్ డ్రామా ఫస్టాఫ్ బాగుందని మూవీ చూసినవాళ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ మెప్పిస్తాయని చెబుతున్నారు. అయితే సెకండాఫ్ ఫ్లాట్ గా సాగిందని, ఎలివేషన్స్ తగ్గాయని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ నటించారు.