విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్ట్.. విక్రమ్ కుమార్‌తో పాన్ ఇండియా సినిమా!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'రణబాలి' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో మరో ప్రాజెక్ట్‌కు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారని, మడాక్ ఫిల్మ్స్ నిర్మించనుందని సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విక్రమ్ కుమార్ గతంలో 'మనం', 'ఇష్క్', 'హలో', 'గ్యాంగ్ లీడర్' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్