బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ (VIDEO)

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ శనివారం రాత్రి ప్రసిద్ధ బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు పట్లోళ్ల కౌశిక్‌ రెడ్డితో కలిసి ఆయన గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి బృందం విజయ్ దేవరకొండను శాలువాతో సత్కరించి, బాలాపూర్ ప్రసిద్ధ లడ్డూను ప్రసాదంగా అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕