తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనుమతి నిరాకరించారు. 112 మంది ఎమ్మెల్యేల పేర్లతో లిస్టును గవర్నర్‌కు విజయ్ అందజేశారు. విజయ్ ఇచ్చిన మెజార్టీ సంఖ్యా బలం పట్ల గవర్నర్ మొగ్గు చూపలేదు. మెజార్టీకి మరో ఆరుగురు సభ్యులు అవసరం అని గవర్నర్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే రేపు(గురువారం) గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కేరళం పర్యటనకు వెళ్లనుండటంతో.. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం ఉంటుందా లేదా అని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.