విజయ్ సీఎం కావడం ఖాయం: విశాల్

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో గవర్నర్ జాప్యం చేస్తున్నారని నటుడు విశాల్ మండిపడ్డారు. 2017-18లో గోవా, మేఘాలయ, మణిపూర్, కర్ణాటక రాష్ట్రాలలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా పాటించాలని ఆయన సూచించారు. ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఫ్లోర్ టెస్టుకు అనుమతించారని, TVK పార్టీ మెజారిటీ సీట్లు సాధించినప్పుడు గవర్నర్ ఎందుకు సంకోచిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల తీర్పును గౌరవించాలని, విజయ్ తప్పకుండా CM అవుతారని విశాల్ ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్