విజయ్‌కు తీవ్ర నిరాశ.. రెండో రోజు వెనక్కి పంపేసిన గవర్నర్

తమిళనాడులో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చేసిన విజ్ఞప్తిని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ వరుసగా రెండో రోజు తిరస్కరించినట్లు సమాచారం. మెజార్టీ నిరూపణకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు సంతకాలతో రావాలని గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీవీకే కూటమికి 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లు సమాచారం. మరోవైపు VCK అధినేత తోల్ తిరుమావళవన్ మాత్రం విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించి, తర్వాత అసెంబ్లీలో బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు.

సంబంధిత పోస్ట్