తమిళనాడులో కస్టడీ మృతిపై జరుగుతున్న తీవ్ర నిరసనలలో నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ పాల్గొన్నారు. చెన్నైలో జరిగిన నిరసనలో విజయ్ నల్ల చొక్కా ధరించి “సారీ కాదు, మాకు న్యాయం కావాలి” అనే ప్లకార్డుతో హాజరయ్యారు. అజిత్ కుమార్ అనే యువ సెక్యూరిటీ గార్డు కస్టడీలో మృతి చెందిన ఘటనపై ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘24 మంది కస్టడీలో చనిపోతే క్షమాపణ సరిపోతుందా?’’ అంటూ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.