తమిళనాడు ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఒక స్థానానికి ఆయన రాజీనామా చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన తిరుచ్చి ఈస్ట్ స్థానం నుంచి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా అక్కడ త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో విజయ్ సన్నిహితురాలు, నటి త్రిషను బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం.. మాజీ ఐఏఎస్ అధికారి సగాయంను తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయించాలని విజయ్ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.