తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 'జన నాయకుడు' సినిమా టైటిల్ కార్డ్‌పై “తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్” అని కనిపించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ వీడియో నిజమైనదా లేక AI ఎడిటా అనేదానిపై స్పష్టత లేదు. దర్శకుడు H. వినోత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాజకీయ నేపథ్యం ఉందని, అందుకే సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా మొదట పొంగల్ సందర్భంగా విడుదల చేయాలనుకున్నా, సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఇప్పుడు మే 15న విడుదల కావచ్చని సమాచారం.