కరూర్ తొక్కిసలాట తర్వాత నేడు పబ్లిక్‌లోకి వస్తున్న విజయ్

సెప్టెంబర్‌లో కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన తర్వాత, టీవీకే అధినేత విజయ్ మంగళవారం పుదుచ్చేరిలో తొలిసారి బహిరంగ సభలో పాల్గొననున్నారు. రోడ్‌షోకు కఠిన షరతులతో అనుమతి లభించింది. కేవలం 5,000 మందికే అనుమతి, టీవీకే క్యూఆర్ కోడ్ ఉన్న కార్లకు మాత్రమే ప్రవేశం, తమిళనాడు నుంచి వచ్చేవారికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా గర్భిణీలు, వృద్ధులు, వికలాంగులు హాజరుకావద్దని పార్టీ కోరింది. విజయ్ ఈ నెలఖరు నుంచి తమిళనాడులో కూడా పర్యటించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్