ఇవాళ (గురువారం) విజయ్ మరోసారి తమిళనాడు ఇన్‌ఛార్జ్ గవర్నర్ R.V.ఆర్లేకర్‌ను కలవనున్నారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై ఇన్‌ఛార్జ్ గవర్నర్‌తో విజయ్ కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన బలం సమీకరణపై కూడా ఈ భేటీలో చర్చ జరగొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొన్న వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.