తమిళ సూపర్ స్టార్, టీవీకే అధినేత విజయ్ తన మంచి మనసును చాటుకున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన ప్రయాణిస్తున్న వ్యాన్‌కు ఎదురుగా బైక్‌పై వెళ్తున్న దంపతులు ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. వారిని గమనించిన విజయ్, వెంటనే తన వాహనాన్ని ఆపించి కిందకు దిగారు. కంగారుగా వారి వద్దకు వెళ్లి పరామర్శించారు. దెబ్బలు తగిలాయా అని ఆరా తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.