తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ మంగళవారం తెల్లవారుజామున తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి, స్వామివారి ప్రసాదంతో పాటు పవిత్రమైన 'వేల్'ను బహూకరించారు. ఎన్నికల వేళ విజయ్ ఈ ఆధ్యాత్మిక యాత్ర చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.