విజయ డెయిరీ బంపర్ ఆఫర్.. త్వరలో 400 కొత్త పార్లర్లు ప్రారంభం

TG: ప్రభుత్వ డెయిరీ సంస్థ అయిన విజయ డెయిరీ ద్వారా నిరుద్యోగ యువతకు ప్రభుత్వం స్వయం ఉపాధి అవకాశలు కల్పించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 400 కొత్త డెయిరీ పార్లర్లను ప్రారంభించాలని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు కీలక ప్రాంతాల్లో ఈ పార్లర్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుండగా.. త్వరలో జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయనుంది. వీటికోసం ముందుగా రూ.25 వేల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు పరిశీలించి పార్లర్ మంజూరు చేస్తారు. వీటిద్వారా నెలకు రూ.30-50 వేల వరకు సంపాదన వస్తుంది.

సంబంధిత పోస్ట్