AP: ఇటీవల రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు విజయసాయి రెడ్డి తన ఎక్స్ వేదికగా తెలిపారు. "వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేసిన లేఖను జగన్‌కు పంపించాను. వచ్చే ఎన్నికల్లో జగన్ అద్భుతమైన విజయం సాధించి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా. నాకు రాజకీయాల్లో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశారు.