శంకర్పల్లి రాణా పరిధిలోని గాజులగూడ గ్రామానికి చెందిన రవి (27) అనే యువకుడు కుటుంబ కలహాల కారణంగా పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యానికి బానిసైన రవిని శుక్రవారం భార్య మందలించడంతో మనస్తాపానికి గురై గ్రామ శివారులో పురుగుమందు తాగాడు. స్థానికులు అతడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి 10 గంటలకు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.