రంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం కాలనీలో సాయంత్రం ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. మృతుడి పై గుర్తుతెలియని వ్యక్తులు పొట్టపై పదునైన వస్తువుతో దాడి చేశారు. అలాగే భారీ బండరాయితో తలపై బలంగా మోది అక్కడికక్కడే హతమార్చినట్లు తెలుస్తుంది. హత్య చేసి పరారవుతున్న ముగ్గురు నిందితులను పెంజర్ల చౌరస్తా వద్ద పట్టుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్