పరిగి నియోజకవర్గం గండీడ్ మండల పరిధిలోని అంచన్ పల్లి గ్రామంలో రూ. 20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం కోసం గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, ఎమ్మార్వో మల్లికార్జున్ రావు, ఎంపీడీవో హరిచంద్ర రెడ్డి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ హలీం, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, చెన్నారెడ్డి, నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.