పరిగి: బోనాల పండుగ ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరిగి గంగపుత్ర సంఘం ప్రతినిధులు డి.సి.సి అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 13, 14 తేదీల్లో పరిగిలో జరగనున్న బోనాల పండుగకు ముఖ్య అతిథిగా హాజరవాలని ఆయనను ఆహ్వానించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, మండల అధ్యక్షుడు కృష్ణ, పార్థసారథి పంతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్