పరిగి మండల పరిధిలోని బసిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కొమిరే రామచంద్రయ్య ఉస్మానియా యూనివర్సిటీలో అర్థశాస్త్రం విభాగంలో పీహెచ్డీ పట్టా పొందారు. పట్టుదలతో శ్రమిస్తే విశ్వవిద్యాలయం పరిశోధన పట్టాలు పొందవచ్చని నిరూపించాడు. ఆర్థిక సమస్యలు అధిగమించి, కఠోర దీక్షతో ప్రయత్నాలు కొనసాగించి ఉస్మానియా యూనివర్సిటీ నుండి పీహెచ్డీ పట్టా పొందడంతో స్థానిక ప్రజలు, నాయకులు అతని పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.