అత్తాపూర్‌లో 13 మంది రౌడీ షీటర్ల బైండోవర్

రాజేంద్రనగర్ జోన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 13 మంది రౌడీ షీటర్లను గురువారం రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ ఐపీఎస్ ఎదుట హాజరుపరిచి, భవిష్యత్తులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా బైండోవర్ చేశారు. సమాజంలో శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అత్తాపూర్ SHO నాగేశ్వరరావు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్