300 మంది మందుబాబులపై కేసులు

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వారాంతంలో నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల్లో మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన 300 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 259 మంది ద్విచక్ర వాహనదారులు, 34 మంది కారు డ్రైవర్లు, ఆరుగురు ఆటో డ్రైవర్లు, ఒక భారీ వాహన డ్రైవర్ ఉన్నారు. గత వారం న్యాయస్థానాలు 251 కేసులను పరిష్కరించినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్