రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చటాన్‌పల్లి వద్ద కేకేఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు, పొగ ఎగసిపడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.