రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన యాదవ్ భుడోకన్ కరాటే క్లబ్‌కు చెందిన 33 మంది క్రీడాకారులు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కరాటే కార్యక్రమంలో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 1200 మందికి పైగా క్రీడాకారులు 20 నిమిషాల్లో 40 సార్లు కతా ప్రదర్శించి గిన్నిస్ రికార్డును నెలకొల్పారు. శిక్షకులైన గోపి, వినయ్, హర్షిక, రాహుల్, ఉప్తేజ్ మార్గదర్శకత్వంలో విద్యార్థులు మెరుగైన ప్రదర్శనతో గ్రామీణ ప్రాంత యువత అంతర్జాతీయ వేదికపై మెరిసి, తమ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు.