తాండూరులో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ ర్యాలీ

తాండూరులో ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి వివేకానంద విగ్రహం వరకు 500 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్వామి వివేకానంద విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ చేశారు. 1949 జూలై 9న ప్రారంభమైన విద్యార్థి పరిషత్ నేడు ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘంగా ఏర్పడి, విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం ఎన్నో ఉద్యమాలు చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్