కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని మద్దూర్లో ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని సెంటర్ కోఆర్డినేటర్ దాసు ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. మధ్యలో చదువు ఆపేసిన వారు ఎవరైనా సరే వయసుతో సంబంధం లేకుండా అడ్మిషన్లు తీసుకోవచ్చని తెలియజేశారు. అదేవిధంగా ఇంటర్ అడ్మిషన్లు కూడా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.