గండీడ్ మండలం చెన్నయ్య పల్లి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మాల గుడిసెల కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ యువ నాయకుడు మోహన్ నాయక్, ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.