వికారాబాద్ జిల్లా పరిగిలోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు శ్రమదానంలో పాల్గొన్నారు. స్కూల్ పరిసరాలను శుభ్రం చేసి, మొక్కలు నాటారు. మట్టి ఎత్తి గుంతలు పూడ్చారు. TPCC చీఫ్ మహేష్ గౌడ్, AICC రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి, మంత్రి పొన్నం, మధు యాష్కీ, MLA రాంమోహన్ రెడ్డి, ఉమ్మడి జిల్లా నేతలు తదితరులు పాల్గొన్నారు.