వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

మేడ్చల్ మల్కాజ్ గిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దండమూడి ఎంక్లేవ్‌లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ చతుర్ధ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, స్థానిక మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా గురువారం హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలతో భక్తులతో కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి, ఆలయ కమిటీ వారు శాలువాతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్